వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే యాసంగిలో వరికి బదులుగా తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలని నర్వ మండల వ్యవసాయ అధికారి అఖిల రెడ్డి సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
నీటి లభ్యతను బట్టి శనగ, జొన్న, కుసుమ, పెసర, మినుము, సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు సాగు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం త్వరలో సబ్సిడీలు అందించనుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

