వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో దాదాపు 30 ఏళ్ల తర్వాత కూరగాయల సాగు రికార్డుస్థాయికి చేరింది. వానాకాలం, ఎండాకాలం కలిపి ఈసారి సుమారు 75 వేల ఎకరాల్లో రైతులు సాగు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న కూరగాయల అవసరాలకు అనుగుణంగా రైతులు ఆసక్తి చూపుతున్నారు.
రాజధానికి సమీపంలో అనువైన భూములు ఉండటం, రవాణా సౌకర్యాల అభివృద్ధి ప్రణాళికలు, ఉద్యానశాఖ ప్రోత్సాహంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
Comments
Loading comments...

