Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేపాడలో ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:13 AM విజయనగరంGeneral
వేపాడలో ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు - Udayam
వేపాడ మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీడీవో సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల 19 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. మండలంలోని 29 పంచాయతీల పరిధిలో 14 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉన్నాయని, 51 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...