Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా నేతతో జనసేన ఆడియో కలకలం

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:24 AM పశ్చిమగోదావరి General
వైకాపా నేతతో జనసేన ఆడియో కలకలం - Udayam
ఏలూరుకు చెందిన వైకాపా నాయకుడితో జనసేన నగర ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏలూరు మేయర్ పోటీ, వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్‌ను కలిసే విషయమై సాగిన ఈ సంభాషణ రాజకీయాంగా కలకలం రేపింది. ఈ ప్రచారంపై రెడ్డి అప్పలనాయుడు స్పందిస్తూ మేయర్ సీటు జనసేనకు కేటాయించినందుకు అభినందించడానికే వైకాపా నేత ఫోన్ చేశారని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...