వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా ఉట్కూర్లో TUCI భవన నిర్మాణ కార్మికుల రెండో మండల మహాసభ జరిగింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను నాలుగు రెట్లు పెంచాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు.
కార్మికులకు రూ.5 లక్షల సహజ బీమా,రూ.15 లక్షల ప్రమాద బీమా, నెలకు రూ.9 వేల పెన్షన్, ESI,ఇందిరమ్మ ఇళ్లు కల్పించాలని తీర్మానించారు. అధ్యక్షుడిగా కూతలి నాగేష్, కార్యదర్శిగా కోళ్ల కృష్ణయ్య ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

