వార్తలకు తిరిగి వెళ్లండి

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల మార్కెట్‌లో ఆదివారం విలస చేపలు సందడి చేశాయి. ఒక్కో చేప ధర రూ.వెయ్యి వరకు పలికింది. సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదే ఈ చేపలను పులసలుగా పిలుస్తారు.
విలసగా ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పలికే చేప ధర పులసగా మారాక రూ.20 వేలకు పైగా చేరుతుంది. కొందరు కొనుగోలుదారులు విలస చేపలనే పులసలుగా భావించి కొనుగోలు చేస్తుంటారు.
Comments
Loading comments...

