వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉండటంతో పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మత్స్యకారులు ఈ నెల 30 వరకు వేటకు వెళ్లరాదని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటించాలని కోరారు.
Comments
Loading comments...

