వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుపాను ముప్పు నేపథ్యంలో రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత ఆదేశించారు. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. బుధవారం బాపట్ల-విశాఖ మధ్య తుపాను తీరం దాటవచ్చని తెలిపారు.
గంటకు 115-125 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదముందన్నారు. సహాయక బృందాలను సిద్ధం చేయాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
Comments
Loading comments...

