వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగతుర్తిలో స్వేరో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సీనియర్ నాయకుడు కొండగడుపుల ఎల్లయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. గురుకుల పితామహుడు ఎస్.ఆర్. శంకరన్ జయంతిని జరుపుకున్నారు.
ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన శంకరన్ సేవలను నాయకులు కొనియాడారు.
Comments
Loading comments...

