Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ నేతలపై లాఠీఛార్జి.. ఎస్పీకి ఫిర్యాదు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 11:45 AM అనంతపురంGeneral
టీడీపీ నేతలపై లాఠీఛార్జి.. ఎస్పీకి ఫిర్యాదు - Udayam
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలో నామినేషన్ల సందర్భంగా టీడీపీ నేతలపై పోలీసులు లాఠీఛార్జి చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. సీఐ ఇస్మాయిల్‌, ఎస్‌ఐ సత్యనారాయణ వ్యవహారశైలిపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి ఎస్పీ సతీశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ.. సంబంధిత సీఐ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Comments

G
Loading comments...