Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమిరాం సంతలో పొట్టేళ్లకు భలే డిమాండ్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:10 PM అనకాపల్లి General
తిమిరాం సంతలో పొట్టేళ్లకు భలే డిమాండ్ - Udayam
దసరా సమీపిస్తుండటంతో దేవరాపల్లి మండలం తిమిరాం సంతలో మేకలు, గొర్రెలు, నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. శుక్రవారం చుట్టుపక్కల జిల్లాల నుంచి కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాటుకోడి ధర రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పలికింది. పొట్టేళ్లు బరువును బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముడయ్యాయి. కొనుగోలుదారుల రాకతో సంతలో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...