వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుపాను బుధవారం తెల్లవారుజామున నరసాపురం వద్ద తీరం తాకాక వేగం తగ్గింది. గంటకు 17 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను మూడు కిలోమీటర్లకు నెమ్మదించింది. దీంతో తీరం దాటేందుకు ఆరు గంటలు పట్టింది.
ఈ సమయంలో గోదావరి జిల్లాల్లో పెనుగాలులు, ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురిశాయి. భూమిపై ఘర్షణ పెరగడం, పైస్థాయి గాలులు బలహీనపడటంతో వేగం తగ్గిందని వాతావరణ నిపుణులు తెలిపారు.
Comments
Loading comments...

