వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండలం రాంపూర్ గ్రామపంచాయతీ సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా పాలకవర్గం నూతన వస్త్రాలు అందజేసింది. గ్రామ పరిశుభ్రత, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఫీడబ్ల్యూ, ఇతర విభాగాల సిబ్బందిని సత్కరించారు.
సిబ్బంది సేవలను గుర్తించి వారికి అండగా నిలవడం తమ బాధ్యతని సర్పంచ్ గోకా మహిపాల్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

