వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో వర్షపు నీటితో ఇబ్బందులు పడిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవికాంత్ యాదవ్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రం అందజేశారు.
లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సుంకిడి ఉప సర్పంచ్ అజయ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

