Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 9:56 AM పల్నాడు General
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సూచించారు. గురువారం క్రోసూరులో పార్టీ కార్యాలయంలో అచ్చంపేట, క్రోసూరు మండలాల నాయకులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంలో పెరిగిన ధరలు, నెరవేర్చని హామీలు, రెడ్‌బుక్‌ పేరుతో జరుగుతున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...