వార్తలకు తిరిగి వెళ్లండి

అంకుశాపూర్ గ్రామ నవచైతన్య యూత్ మాజీ అధ్యక్షుడు గుర్రపు శంకర్ గౌడ్ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో చేరారు. మండల కార్యదర్శి అంబాల అశ్వద్ధామ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు.
ప్రజా సమస్యలపై ఉద్యమాలకు ఈ చేరిక ఉపయోగపడుతుందని అశ్వద్ధామ అన్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి చేరానని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని శంకర్ గౌడ్ తెలిపారు.
Comments
Loading comments...

