వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి ముంబయి పర్యటన నేపథ్యంలో సోమవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం వాయిదా పడింది. కృష్ణా జలాల పంపిణీపై చర్చించేందుకు ఈ నెల 26న భేటీ ఏర్పాటు చేశారు.
అదే రోజు తుమ్మిడిహెట్టి అంశంపై చర్చలకు సీఎం ముంబయి వెళ్తుండటంతో అధికారులు హాజరుకాలేమని బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు బోర్డు తెలిపింది.
Comments
Loading comments...

