Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయన్న స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడాలి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:55 AM వనపర్తిGeneral
సాయన్న స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడాలి - Udayam
పానగల్ మండలం కేతేపల్లిలో మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీరామ్ పిలుపునిచ్చారు. పేదల అభ్యున్నతి కోసం పోరాడిన పండుగ సాయన్న, చాకలి ఐలమ్మ వంటి మహనీయులను మరువకూడదని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...