Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతిక లోపంతో విమానం అత్యవసర ల్యాండింగ్

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 12:42 PM హైదరాబాద్General
సాంకేతిక లోపంతో విమానం అత్యవసర ల్యాండింగ్ - Udayam
హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్‌ ఇండియా AI 417 విమానం శుక్రవారం సాంకేతిక లోపంతో శంషాబాద్‌ విమానాశ్రయానికి తిరిగొచ్చింది. టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాలకే సమస్యను గుర్తించిన పైలట్‌ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. విమానం తిరిగి ల్యాండ్‌ కావడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 109 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...