Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 నాణేలతో భర్తకు బైక్ కానుక

Follow Udayam on Google
Shruthi Oct 23, 2026 8:09 PM ఖమ్మంGeneral
రూ.10 నాణేలతో భర్తకు బైక్ కానుక - Udayam
ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లికి చెందిన విజయ ఏడాదిపాటు పొదుపు చేసిన రూ.50 వేల నాణేలతో భర్త విజయరావుకు బైక్ కొనుగోలు చేసింది. టీ విక్రయించేందుకు రోజూ కాలినడకన తిరుగుతున్న భర్త కష్టాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దసరా సందర్భంగా రూ.10 వేల రాయితీ ప్రకటించిన షోరూంకు దంపతులు వెళ్లారు. నాణేలను చూసి ఆశ్చర్యపోయిన సిబ్బంది, విజయ ఆలోచనను అభినందించి రాయితీతో వాహనాన్ని అందించారు.

Comments

G
Loading comments...