వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల కావేరమ్మపేట హైవే ఫ్లైఓవర్ పక్కన రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకతో టీవీఎస్ ఎక్స్ఎల్పై వెళ్తున్న రైతు అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. ఈ ఘటనపై మాజీ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పాలకొండ ప్రణీల్ చందర్ ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్డుపై ఇసుకను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్, హైవే అధికారులను డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

