Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీలో ముంబైకి వరుసగా రెండో బోనస్‌ విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 11:19 AM జాతీయంక్రీడలు
రంజీలో ముంబైకి వరుసగా రెండో బోనస్‌ విజయం - Udayam
రంజీ ట్రోఫీలో ముంబై జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ బోనస్‌ పాయింట్‌తో గెలిచింది. గ్రూప్‌-డి మ్యాచ్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ను ఇన్నింగ్స్‌ 97 పరుగుల తేడాతో ఓడించింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (154), ఆకాశ్‌ ఆనంద్‌ (117 నాటౌట్‌) సెంచరీలతో రాణించడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 528/8 వద్ద డిక్లేర్‌ చేసింది. 388 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన హిమాచల్‌ 291 పరుగులకు ఆలౌటైంది.

Comments

G
Loading comments...