వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గం మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. గట్టి బందోబస్తు మధ్య ఎంపీడీవో కార్యాలయంలో మొదటి రోజు 11 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్‌వో అమరేశప్ప, ఎంపీడీవో కొండన్న తెలిపారు.
వీటిలో టీడీపీ తరఫున 7 మంది, వైసీపీ నుంచి 4 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

