వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టులో కేసులు పెండింగ్లో ఉండటంతో రాంబిల్లి మండలంలోని నాలుగు పంచాయతీల ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎంపీడీవో జయమాధవి తెలిపారు. పంచదార్ల, అప్పారాయుడుపాలెం, జిరాయతీ చింతువ, మన్యపు చింతువ పంచాయతీలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.
గత ఎన్నికలకు ముందు పంచదార్ల, జిరాయతీ చింతువ పంచాయతీల విభజనపై కోర్టులో కేసులు దాఖలయ్యాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం నాలుగు పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

