వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోట మండలం రామకృష్ణాపురంలో రైతుల కోసం సుమారు రూ.40 లక్షలతో నిర్మించిన గిడ్డంగి భవనం రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంది. పంట ఉత్పత్తులు, విత్తనాలు, ఎరువులు నిల్వ చేసుకునేందుకు నిర్మించినా రహదారి సౌకర్యం లేక వినియోగంలోకి రాలేదని స్థానికులు తెలిపారు.
గిడ్డంగికి రహదారి సౌకర్యం కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

