వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఆరు నెలల క్రితం ప్రభుత్వం కేంద్రాన్ని మంజూరు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినా, పనులు ప్రారంభం కాలేదు.
దీంతో స్థానికంగా, చుట్టుపక్కల మండలాల్లోని రోగులు డయాలసిస్ కోసం మెదక్, సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి త్వరగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.
Comments
Loading comments...

