వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో గురువారం ఆదివాసీ నాయకుడు కొమురం భీమ్ జయంతి నిర్వహించారు. కుర్సెంగ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పటేల్ కుర్సెంగ దామోదర్, మహిళా అధ్యక్షురాలు ఆత్రం కృష్ణకుమారి, ఆదివాసీ తోటి సంఘం సభ్యులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం, త్యాగాలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

