వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం నామోషీ అనే భావన పోవాలని, నాణ్యమైన విద్యే అసమానతలను తొలగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఆయన ప్రారంభించి విద్యార్థులతో సమయం గడిపారు.
కులాల వారీగా కాకుండా, అందరికీ సమాన విద్యను అందించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణను విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిపేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

