Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులుల రక్షణకు గ్రేహౌండ్స్ బృందాలు!

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:00 AM ఆదిలాబాద్General
పులుల రక్షణకు గ్రేహౌండ్స్ బృందాలు! - Udayam
తెలంగాణలోని కవ్వాల్, అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాల్లో గ్రేహౌండ్స్ బృందాలను వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పులుల రక్షణ, అటవీ సంరక్షణ, వేట నిరోధక చర్యలను బలోపేతం చేసేందుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ అధికారిక ఉత్తర్వులు అందలేదని జన్నారం అటవీ అధికారి రామ్‌మోహన్ తెలిపారు.

Comments

G
Loading comments...