వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులతో పశుగ్రాసం కొరత తీవ్రమవుతోంది. పాడి రైతులు పెరిగిన ఎండుగడ్డి ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రూ.110 ఉన్న గడ్డి కట్ట ధర ప్రస్తుతం రూ.160కి చేరింది.
రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. 5,680 గ్రామాల్లో 73.54 లక్షల పశువులకు మేత సమస్య ఎదురయ్యే ప్రమాదముందని పశుసంవర్థక శాఖ గుర్తించింది. గడ్డి సాగుకు నీటి కొరత అడ్డంకిగా మారింది.
Comments
Loading comments...

