Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటకులను ఆకట్టుకుంటున్న భీముని పాదం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:00 AM మహబూబాబాద్ General
పర్యాటకులను ఆకట్టుకుంటున్న భీముని పాదం - Udayam
గూడూరు మండలం సీతానగరం శివారులోని భీముని పాదం జలపాతం ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. హరితవనం మధ్య ఉన్న ఈ జలపాతాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. నర్సంపేట–మహబూబాబాద్‌ జాతీయ రహదారి నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే జలపాతానికి చేరుకోవచ్చు. దసరా సెలవుల్లో కుటుంబంతో సేదతీరేందుకు ఇది అనువైన ప్రదేశంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...