వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో నేడు MPTC నామినేషన్ల పరిశీలన జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో మున్సిపల్ నామినేషన్ల పరిశీలనకు వైసీపీ, కాంగ్రెస్, ఇతర అభ్యర్థులను అడ్డుకున్నారని, పత్రాలు, సెల్‌ఫోన్లు లాక్కున్నారని ఆరోపణలు వచ్చాయి. లాఠీచార్జి కూడా జరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నేటి MPTC స్క్రూటినీపై హైటెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

