వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ప్రాజెక్టు నుంచి 118 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందని ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 1.820 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వకు గాను 0.989 టీఎంసీల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్టు నుంచి 29 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టపోతున్నట్లు తెలిపారు. డెడ్ స్టోరేజ్ 0.175 టీఎంసీలు, లైవ్ స్టోరేజ్ 1.645 టీఎంసీలుగా ఉందని వెల్లడించారు.
Comments
Loading comments...

