వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ కోసం పనిచేయని నేతలు పదవులు వదులుకోవాలని భాజపా తెలంగాణ ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులతో సమావేశమైన ఆయన క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు పార్టీ పదవులకు రాజీనామా చేసి నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలన్నారు. ఆర్భాటాలు తగ్గించి ప్రజలతో నేరుగా మాట్లాడాలని, నేతల పనితీరును పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

