వార్తలకు తిరిగి వెళ్లండి

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పల్లెపహాడ్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ 8వ వార్డులో పండుగ సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి మాట్లాడారు.
గజ్వేల్ నియోజకవర్గంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

