Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిప్రిలో ఘనంగా కుంకుమార్చనలు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:24 AM నిర్మల్ General
పిప్రిలో ఘనంగా కుంకుమార్చనలు - Udayam
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలోని దుర్గామాత మండపంలో శుక్రవారం రాత్రి కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించారు. భక్తుల రాకతో మండపం పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...