వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాన్స్‌లో పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలపై ఐదు లక్షల మందికి పైగా ప్రజలు నిరసనలకు దిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. విద్యార్థులతో ప్రారంభమైన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.
ప్రభుత్వ రుణభారం జీడీపీలో 118 శాతం దాటగా, యువతలో నిరుద్యోగం దాదాపు 20 శాతానికి చేరింది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ శాంతికి పిలుపునిచ్చి, హింసను ఖండించారు.
Comments
Loading comments...

