Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో MPTC నామినేషన్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 12:14 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెనుకొండలో MPTC నామినేషన్ల పరిశీలన - Udayam
పెనుకొండ MPDO కార్యాలయంలో శనివారం MPTC నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఎర్రమంచి, గుట్టూరు, నాగలూరు, రాంపురం, మునిమడుగు, మావుటూరు, దుద్దేబండ, శెట్టిపల్లి తదితర గ్రామాల నామినేషన్లను పరిశీలిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేటాయించిన సమయాల ప్రకారం స్క్రూటినీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మండల రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...