వార్తలకు తిరిగి వెళ్లండి

యద్దనపూడి మండలం తణుబోద్ధివారిపాలెంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఎస్సై రత్నకుమారి సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

