వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపూడి ప్రాచీన శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి శమీపత్ర, ఆయుధ పూజలు వైభవంగా జరిగాయి. విజయదశమి మరుసటి రోజు ఈ పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకుడు వెంకటరావు శర్మ తెలిపారు.
పెద్దాపురం సంస్థాన రాజు శ్రీవత్సవ జగపతి మహారాజ్, బుచ్చి సీతయ్యమ్మ దంపతుల ఆదేశాల మేరకు పూజలు నిర్వహించినట్లు చెప్పారు. బాణాలతో జమ్మి పత్రిని కొయ్యగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

