Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల బస్సులకు టోల్‌ మినహాయింపు కోరుతూ వినతి

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:54 PM కరీంనగర్General
పాఠశాల బస్సులకు టోల్‌ మినహాయింపు కోరుతూ వినతి - Udayam
కొత్తగట్టు వద్ద టోల్‌ గేట్‌ ఏర్పాటు వల్ల నెలకు రూ.17 వేల అదనపు భారం పడుతోందని హుజూరాబాద్‌ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తెలిపాయి. ఈ మేరకు జాతీయ రహదారి అధికారులకు వినతిపత్రం అందజేశాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రతిరోజూ టోల్‌ గేట్‌ దాటాల్సి వస్తోందని పేర్కొన్నాయి. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల బస్సులకు టోల్‌ రుసుము నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరాయి.

Comments

G
Loading comments...