వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆదివారం తనిఖీలు నిర్వహించారు. పాత బస్టాండ్ ప్రాంతంలో సూరిబాబు అనే వ్యక్తి వద్ద 43 మద్యం బాటిళ్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ సూర్యకుమారి తెలిపారు.
ఎక్సైజ్ డీటీతో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఈ పట్టివేత జరిగినట్లు చెప్పారు. నిందితుడి నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

