Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌లో 20 మంది కానిస్టేబుళ్ల కిడ్నాప్‌

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 4:30 PM అంతర్జాతీయంGeneral
పాక్‌లో 20 మంది కానిస్టేబుళ్ల కిడ్నాప్‌ - Udayam
పాకిస్థాన్‌లోని క్వెట్టా-కరాచీ హైవేపై సాయుధులు 20 మంది కానిస్టేబుళ్లను కిడ్నాప్‌ చేశారు. కలత్‌ పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకొని, వ్యాన్‌లో ఇళ్లకు వెళ్తుండగా మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు వాహనాన్ని అడ్డగించారు. వ్యాన్‌తో పాటు కానిస్టేబుళ్లను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. డ్రైవర్‌, మరో ముగ్గురు ప్రయాణికులను విడిచిపెట్టారు. కిడ్నాప్‌ను మాస్తుంగ్‌ పోలీసులు ధ్రువీకరించారు.

Comments

G
Loading comments...