వార్తలకు తిరిగి వెళ్లండి

‘మూకుత్తి అమ్మన్ 2’ విడుదలకు ముందే తమిళనాడులో నయనతారకు 60 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయడంపై నటి రేజీనా కసాండ్రా ప్రశంసలు కురిపించారు. ఈ స్థాయి కటౌట్ అందుకున్న తొలి నటి నయనతారేనని తనకు చెప్పారని,ఆమె స్టార్‌డమ్ అద్భుతమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార దేవతగా, పోలీసు అధికారిణిగా కనిపించనున్నారు.రేజీనా శక్తిమంతమైన ప్రతినాయిక పాత్ర పోషిస్తున్నారు.
Comments
Loading comments...

