వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీజన్ మార్పు నేపథ్యంలో అయోధ్య రామాలయ దర్శన వేళలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సవరించింది. నవంబర్ 1 నుంచి ఆలయం ఉదయం 4 గంటలకు తెరిచి, రాత్రి 10 గంటలకు మూసివేయనున్నారు. భక్తులకు ఉదయం 6:30 నుంచి దర్శనానికి అనుమతిస్తారు.
ఉదయం మంగళ హారతి, బాలభోగ్, రాజ్‌భోగ్, సాయంత్రం సంధ్యా హారతి సమయాల్లో దర్శనానికి విరామం ఉంటుంది. ప్రస్తుతం ఉదయం 3:45 నుంచి రాత్రి 10:30 వరకు భక్తులను అనుమతిస్తున్నారు.
Comments
Loading comments...

