Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో 3 గంటలకే విద్యాశాఖ కార్యాలయానికి తాళం?

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:54 PM వరంగల్General
నర్సంపేటలో 3 గంటలకే విద్యాశాఖ కార్యాలయానికి తాళం? - Udayam
నర్సంపేట మండల విద్యాశాఖ కార్యాలయం సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉండగా, మధ్యాహ్నం 3 గంటలకే మూతపడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎంఆర్‌సీ కార్యాలయాన్ని పరిశీలించగా తాళం వేసి ఉండటంతో పాటు సిబ్బంది అందుబాటులో లేరని తెలిపారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ఎంఈవోకు ఫోన్ చేసినా స్పందించలేదని పేర్కొన్నారు. సిబ్బంది విధులపై జిల్లా అధికారులు విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...