Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:52 AM నెల్లూరుGeneral
నెల్లూరులో అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ - Udayam
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవాల అంశం ఆసక్తికరంగా మారింది. 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ అభ్యర్థులు 8 వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. తాజా ఎన్నికల్లోనూ 8 వార్డులు ఏకగ్రీవం కాగా అవన్నీ టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఐదేళ్ల వ్యవధిలో రెండు పార్టీలకు ఒకే సంఖ్యలో వార్డులు ఏకగ్రీవం కావడం విశేషంగా మారింది. దీంతో నెల్లూరు ఎన్నికల్లో ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...