వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియాలోని బుసాన్ కాలువలో దాదాపు నెల రోజులుగా చిక్కుకున్న మూడు మీటర్ల పొడవైన డస్కీ సొరచేప ఎట్టకేలకు సముద్రంలోకి చేరింది. సెప్టెంబరు మధ్యలో కాలువలోకి వచ్చిన ఈ సొరచేపను చూసేందుకు 17 లక్షల మంది సందర్శకులు తరలివచ్చారు.
దీన్ని సముద్రంలోకి పంపేందుకు అధికారులు రెండుసార్లు విఫలమయ్యారు. బుధవారం మూడో ప్రయత్నంలో బల్లకట్టు సాయంతో చివరకు సొరచేప సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్లిపోయింది.
Comments
Loading comments...

