వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా త్రిపురాంతకం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు.
కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో పటిష్ట భద్రత కల్పించాలని, అనుమతి ఉన్నవారినే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

