వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్, ఉప్పునుంతల, మక్తల్ మండలాల్లో శాశ్వత కరువు నివారణకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం అధికారులతో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
నీటి వనరుల సమర్థ వినియోగం, రైతుల జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా ప్రాజెక్టు చేపట్టనున్నారు. గ్రామసభల ద్వారా స్థానిక అవసరాలను గుర్తించి కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
Comments
Loading comments...

